CM Revanth Reddy : రాష్ట్రంలో జూన్ నుంచి ఇప్పటివరకు సగటుతో పోల్చితే 21 శాతం తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ, గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వాతావరణ శాఖ సూచనల ఆధారంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం చేస్తూ టీంలను ముందుగానే పంపుతున్నట్లు సీఎం వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్ల ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను గ్రౌండ్ లెవెల్‌లో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
పిడుగుపాటుతో కలిగే నష్టాలను సకాలంలో నమోదు చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించగా, గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్లు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆకస్మిక తనిఖీలు చేయాలని సీఎం స్పష్టం చేస్తూ, “అజాగ్రత్త ప్రదర్శిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు” అని హెచ్చరించారు. కలెక్టర్ల కార్యాచరణపై ప్రతిరోజూ పూర్తి రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని సీఎస్‌కు ఆదేశించారు.
PM Modi: జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారు.. అచ్యుతానందన్‌తో ఉన్న ఫొటో షేర్ చేసిన మోడీ
వర్షాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి యాజమాన్యంపై దృష్టి సారించాల్సిందిగా సీఎం సూచించారు. “ఈ ఖరీఫ్ సీజన్‌లో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి సాధించి దేశంలో నెంబర్ వన్‌గా నిలిచాం,” అని ఆయన పేర్కొన్నారు. ఎరువుల కొరతపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించిన సీఎం, ప్రతి ఎరువుల దుకాణంలో స్టాక్ వివరాలు డిస్‌ప్లే బోర్డులపై స్పష్టంగా చూపించాలని కలెక్టర్లకు ఆదేశించారు. స్టాక్ వివరాలు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. యూరియా కొరత లేనందున, దానిని ఇతర వ్యాపార అవసరాలకు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల కోసం ప్రత్యేక ఫిర్యాదు డెస్క్ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయని సీఎం వెల్లడించారు. గతంలో రేషన్ షాపులపై ప్రజల ఆసక్తి తక్కువగా ఉండేదని, కానీ ఇప్పుడు సన్న బియ్యం అందుబాటులోకి రావడంతో రేషన్ కార్డుల డిమాండ్ పెరిగిందని తెలిపారు. రేషన్ కార్డులు, రేషన్ షాపుల విలువ పెరిగిందని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించాలని, వీటిలో శాసనసభ్యులు, జిల్లా ఇంచార్జి మంత్రులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. ఈ పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు సమన్వయం చేయాలని సూచించారు.
Hari Hara Veera Mallu Pre Release Event LIVE: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
