NTV Telugu Site icon

Prajapalana: ప్రజాపాలన దరఖాస్తు ఫారం ఇదే.. ఏ డాక్యుమెంట్లు కావాలంటే..!

Prajapalana

Prajapalana

Prajapalana:ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపరిపాలన నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రజాపరిపాలన కార్యక్రమంలో భాగంగా పది రోజుల పాటు గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. అయితే.. ఈ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి.. ఎలా పూరించాలి.. దానికి ఎలాంటి పత్రాలు కావాలి వంటి సందేహాలు ప్రజలకు ఉన్నాయి.

Read also: Sabarimala Temple Income: 39 రోజుల్లోనే.. 200 కోట్లు దాటిన శబరిమల ఆలయ ఆదాయం!

అయితే.. వాటన్నింటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దరఖాస్తు ఫారాన్ని విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం పబ్లిక్ గవర్నెన్స్ అప్లికేషన్ పేరుతో దరఖాస్తు ఫారమ్‌ను సిద్ధం చేసింది. అయితే.. ఒక్కో పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా.. అందరికీ ఒకే దరఖాస్తును సిద్ధం చేసింది. ముందుగా కుటుంబ వివరాలను పూరించాలి. ఇందులో కుటుంబ వివరాల్లో.. కుటుంబ యజమాని పేరుతో ప్రారంభించి.. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నంబర్, రేషన్ కార్డు నంబర్, మొబైల్ నంబర్, వృత్తి, కులంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలను కూడా నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేనేత పథకాలకు సంబంధించిన వివరాలను వరుసగా నమోదు చేయాలి. ఏదైనా పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆ పథకం కింద అడిగిన వివరాలను నమోదు చేయాలి.

* మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం పొందాలంటే సంబంధిత పెట్టెలో టిక్ మార్క్ వేయాలి. రూ.500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వారు గ్యాస్ కనెక్షన్ నంబర్, ఏజెన్సీ పేరు, ఏడాదికి ఉపయోగించే సిలిండర్ల సంఖ్యను నమోదు చేయాలి.
* రైతు భరోసా కోసం.. లబ్ధిదారుడైన రైతు, కౌలు రైతు టిక్ చేయాలి. రైతు కూలీ అయితే.. ఉపాధి హామీ కార్డు నంబర్ నమోదు చేయాలి.
* ఇందిరమ్మ ఇళ్లు కావాలనుకునే వారు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలా వద్దా అని టిక్ చేయాలి. లేదా అమరవీరుల కుటుంబానికి చెందిన వారైతే..పేరు, అమరవీరుడు అయిన సంవత్సరం, ఎఫ్‌ఐఆర్ నంబర్, మరణ ధ్రువీకరణ పత్రం నంబర్ ఇవ్వాలి. ఉద్యమకారుల విషయంలో సంబంధిత ఎఫ్‌ఐఆర్ నంబర్ లేదా జైలుకు వెళ్లే వివరాలను పొందుపరచాలి.
* ఇక గృహజ్యోతి పథకానికి సంబంధించి.. ఒక నెలలో వినియోగించే విద్యుత్ మొత్తాన్ని యూనిట్లలో పేర్కొనాలి. దీనితో పాటు విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్‌ను కూడా నమోదు చేయాలి.
* చేనేత పథకం పొందాలనుకునే వారు.. వికలాంగులైతే సంబంధిత పెట్టెలో టిక్‌ పెట్టాలి లేదా వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు అయితే సంబంధిత పెట్టెలో టిక్‌ పెట్టాలి. అన్ని తరువాత, దరఖాస్తుదారు పేరు, సంతకం, తేదీని క్రింద వ్రాయాలి.
* ఈ దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు తెల్ల రేషన్‌కార్డు జిరాక్స్‌ను జతచేయాలి. నింపిన దరఖాస్తును గ్రామసభలో అధికారికి ఇచ్చి.. వారు అడిగిన వివరాలు చెబితే.. దరఖాస్తుదారు ఏ పథకానికి అర్హులో పరిశీలించి నిర్ణయిస్తారు. అందుకే.. దరఖాస్తు చివర రసీదులో నమోదు చేసి.. సంతకం చేసి ప్రభుత్వ ముద్ర ఇచ్చారని దీనిని గమనించాలని కోరారు.
* అయితే మనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. టిక్ మార్కులు ఒకటి రెండు సార్లు కొట్టడం అలాంటి పనులు చేయకూడదని, కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఒకసారి టిక్ మార్క్ వేసి, ఆతరువాత దానిని కొట్టివేసి మరొకటి వేయడం కరెక్ట్ కాదని సూచించారు. దీనిని గమనించాలని ప్రజలకు సూచించారు.
Sabarimala Temple Income: 39 రోజుల్లోనే.. 200 కోట్లు దాటిన శబరిమల ఆలయ ఆదాయం!

Show comments