Sabarimala Temple Income: 39 రోజుల్లోనే.. 200 కోట్లు దాటిన శబరిమల ఆలయ ఆదాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala Temple Close Today Due To Madalapuja: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల దేవాలయానికి ప్రతి ఏటా భక్తుల తాకిడి పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే.. ఈ ఏడాది యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో డిసెంబర్ 25 వరకు 31,43,163 మంది శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. దాంతో ఆలయ ఆదాయం కూడా పెరిగింది. శబరిమల ఆలయ ఆదాయం ఈ సీజన్లో రూ. 200 కోట్లు దాటింది. గత 39 రోజుల్లో (డిసెంబర్ 25 వరకు) రూ. 204.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మంగళవారం తెలిపింది.
భక్తులు సమర్పించిన నాణేల ద్వారా రూ. 63.89 కోట్లు, అరవణ ప్రసాదం విక్రయంతో రూ. 96.32 కోట్లు, అప్పం ప్రసాదం విక్రయం ద్వారా రూ. 12.38 కోట్లు వచ్చినట్లు టీడీబీ తెలిపింది. భక్తులు సమర్పించిన నాణేలను పూర్తిగా లెక్కిస్తే.. ఆదాయం మరింత పెరుగుతుందని టీడీబీ అధికారులు చెప్పారు. డిసెంబర్ 25 వరకు శబరిమలను 31,43,163 మంది దర్శించుకున్నారని.. 7,25,049 మందికి అన్నదానం నిర్వహించినట్లు వెల్లడించారు. 40 రోజుల్లో 208 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
Also Read: Central Congo Floods: సెంట్రల్ కాంగోలో భారీ వరదలు.. 22 మంది మృతి! పలువురు గల్లంతు
బుధవారం నిర్వహించే మండల పూజకు టీడీబీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పూజ అనంతరం బుధవారం రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిలక్కు పూజల కోసం డిసెంబర్ 30న తిరిగి తెరవనున్నారు. నేడు చివరి రోజు కావడంతో శబరిమలలో భారీగా భక్తుల రద్దీ ఉంది. అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. జనవరి 15న మకరవిలక్కు పూజ నిర్వహించనున్నట్లు ట్రావెన్ కోర్ దేవసం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!