Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్‌కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
- నాన్-డెయిరీ పనీర్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం
- సెప్టెంబర్ 10 నుంచే నిషేధం అమల్లోకి
- తయారీ నుంచి అమ్మకం వరకు అన్ని దశలపై బ్యాన్
- ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగానే నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నాన్-డెయిరీ పనీర్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నాన్-డెయిరీ, ఆర్టిఫిషియల్ పనీర్ లేదా అనలాగ్ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 10, 2026 నుంచి ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా నాన్-డెయిరీ, ఆర్టిఫిషియల్ లేదా అనలాగ్ పనీర్‌ను ఏ రూపంలోనైనా తయారు చేయడం, ప్రాసెసింగ్ చేయడం, ప్యాకింగ్ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం వంటి కార్యకలాపాలపై నిషేధం వర్తించనుంది. అంటే ఉత్పత్తి నుంచి వినియోగదారుడికి విక్రయించే వరకు అన్ని దశల్లోనూ ఈ నిషేధం అమల్లో ఉంటుంది.
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006లోని సెక్షన్ 30(2)(a) కింద తనకు ఉన్న అధికారాలను వినియోగించుకుని రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లో ఉండనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక గెజిట్‌ను ప్రభుత్వం నోటిఫై చేసింది. 2026 సెప్టెంబర్ 10 తేదీతో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 807లో ఈ వివరాలను పొందుపరిచారు.
నిషేధ ఉత్తర్వులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించాలని సంబంధిత వర్గాలను అధికారులు ఆదేశించారు. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!