Telangana National Unity Vajrotsavam: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు (శుక్రవారం) రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 15 వేల మందితో జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు.. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞత చాటుకున్నారు. పలు చోట్ల పటాకులు కాల్చి తమ ఆనందం వ్యక్తం చేశారు.
* సిరిసిల్లలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవ భారీ ర్యాలీ
* తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్‌లో ర్యాలీని మంత్రి తలసాని శ్రీవివాస్ యాదవ్ ప్రారంభించారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి తలసాని జాతీయ జెండా చేతబూని ర్యాలీలో కదిలారు. ఏడాదిపాటు వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు.
* తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా మహబూబ్ నగర్ జడ్పీ మైదానం నుండి జూనియర్ కళాశాల గ్రౌండ్స్ వరకు భారీ ర్యాలీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
* తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా హన్మకొండ జిల్లా హయాగ్రీవా చారీ గ్రౌండ్స్ నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు భారీ ర్యాలీని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. విద్యార్థులు మహిళలు పోలీసులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు.
* తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గ ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.
* ఖమ్మం జిల్లా మధిరలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ. పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వృద్ధి రాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్
* కరీంనగర్ జిల్లా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలులో భాగంగా అమరవీరుల స్థూపం నుండి అంబేద్కర్ స్టేడియం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ. పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్,మేయర్ సునీల్ రావు. మానకొండూర్ మండల కేంద్రంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ కు తరలిన నాయకులు, మహిళలు, విద్యార్థులు, అధికారులు
* ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత దినోత్సవం వేడుకల్లో భాగంగా సత్తుపల్లి లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యం లో జాతీయ జెండా లతో సుమారు 10 వేల మందితో భారీ ర్యాలీ.. జాతీయ జెండాలతో కళకళలాడుతున్న సత్తుపల్లి.
* కామారెడ్డి జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డి కేంద్రంలో భారీ ర్యాలీ. పాల్గొన్న ఎంపీ బి బి పాటిల్ ఎమ్మెల్యే సురేందర్ జిల్లా ఆదనపు కలెక్టర్ చంద్ర మోహన్ పోలీస్ అధికారులు.
* ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజవర్గంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ. వేల మందితోజాతీయ జెండాలతో వీధుల్లో ర్యాలీ నిర్వహణ. పాల్గొన్న పాఠశాల విద్యార్థులు అధికారులు.
* నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవ వేడుకలు.. హౌసింగ్ బోర్డ్ నుంచి బస్ డిపో వరకు విద్యార్థులు, ప్రజా ప్రతినిధుల, అధికారుల ర్యాలీ.. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ పద్మావతి, కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ మనోహర్..
* నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు డిచిపల్లి రైల్వే స్టేషన్ నుండి కెఎన్ఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ. పాల్గొన్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.. ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నియోజకవర్గ పరిధిలోని జడ్పీటీసీ లు,ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు
* కొమరం భీం జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా అధికారులు, నాయకులు, విద్యార్థినీ విద్యార్థులు భారీ ర్యాలీ. ర్యాలీని ప్రారంభించిన జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్
* పెద్దపల్లి జిల్లా మంథనిలో జాతీయ సమైక్యత దినోత్సవాల సందర్భంగా పాత పెట్రోల్ బంక్ నుంచి కాలేజీ గ్రౌండ్ వరకు ర్యాలీ. ర్యాలీలో పాల్గొన్న పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, భూపాలపల్లి జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఒక వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వాల్సి ఉండగా గంటల తరబడి ఎండలో నిలబెట్టి ర్యాలీ అనంతరం పంపించిన అధికారులు.
* రాజన్న సిరిసిల్ల జిల్లా జాతీయ సమైక్యత వజ్రోత్సావాల్లో భాగంగా జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ కు పట్టణంలో నేతన్న విగ్రహం జాతీయ జెండాలతో విద్యార్థులు, నాయకులు, అధికారులు, ప్రజలతో భారీ ర్యాలీ. ర్యాలీని ప్రారంభించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్.
* సూర్యాపేట జిల్లా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల సందర్బంగా సూర్యాపేటలో భారీ తిరంగా ర్యాలీ పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి , జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.
* యాదాద్రి జిల్లా భువనగిరిలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా చెరువు కట్ట నుండి గంజి మార్కెట్ వరకూ ర్యాలీ హజరినట్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్త్ , కలెక్టర్ పమేలా సత్పతి, డిసిపి నారాయణ రెడ్డి.
Minister Seediri Appalaraju: పాదయాత్ర కచ్చితంగా అడ్డుకుంటాం.. మా గుండెలపై కొడతాం అంటే ఊరుకుంటామా?