NTV Telugu Site icon

Medigadda Project: మేడిగడ్డలో తెలంగాణ మంత్రుల పర్యటన.. మంత్రి ఉత్తమ్ ఏమన్నారంటే..

Uttamkumar Reddy

Uttamkumar Reddy

Medigadda Project: కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డను సందర్శించింది. మేడిగడ్డలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు పర్యటిస్తున్నారు. మేడిగడ్డ నిర్మాణంపై అధికారులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను పరిశీలించారు. ఈ ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ ప్రాజెక్టు కుప్పకూలింది. మేడిగడ్డ కుప్పకూలినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మూడేళ్లలో కాళేశ్వరం కుప్పకూలడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. కాలేశ్వరం పై మా పార్టీ విధానం ఒకటే.. ప్రాణహిత చేవెళ్ల ని 35 వేల కోట్లతో నిర్మించాలి అనేది మా విధానం అన్నారు. కానీ ప్రాజెక్టు కట్టే పనిలో ఉండగా ప్రభుత్వం మారిందన్నారు.మా ప్లాన్ మార్చేసి.. ప్రాజెక్టు లొకేషన్ మార్చింది బీఆర్ఎస్ అన్నారు. పదేళ్ళలో ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. 35 వేల కోట్ల తో మేము కట్టలి అనుకున్నది.. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లకు పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రారంభం నుండే మాకు అనుమానాలు ఉన్నాయన్నారు.

Read also: Kurchi Tatha: పవన్ ఫాన్స్ తో గొడవ.. వారం రోజులుగా కుర్చీతాత మిస్సింగ్.. ఎక్కడ దొరికాడంటే?

సందేశాలు వ్యక్తం చేశాము.. కాళేశ్వరం డ్యామేజ్ కావడం దురదృష్టకరమన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు. లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులకు బిల్డర్లదే బాధ్యత అన్నారు. ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులను కూడా సమీక్ష కోసం సమావేశానికి పిలిచామని చెప్పారు. ప్రాజెక్టులు ఎవరు కట్టినా వాటి నాణ్యతకు బాధ్యత వహించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంత భారీ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను బయటపెడతామన్నారు. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడంతో నీటిని నిల్వ చేసుకోలేకపోతున్నారు. నదిలో నీటిని దిగువకు విడుదల చేయాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారంలో వచ్చే నీటి బుగ్గలను కూడా మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. నిర్మాణం, డిజైన్‌లో లోపాలుంటే పరిశీలిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. డిజైన్‌లో లోపాలున్నాయా, నిర్మాణ సంస్థలో లోపాలున్నాయా అనే దానిపై కూడా స్పష్టత రానుంది. కాళేశ్వరం నిర్మించిన అధికారులతో ఎల్‌అండ్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ తర్వాత కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. మరోవైపు ప్రాజెక్టులో పిల్లర్లు కూలిన ప్రాంతాన్ని సందర్శించేందుకు మీడియాను అనుమతించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Read also: Kurchi Tatha: పవన్ ఫాన్స్ తో గొడవ.. వారం రోజులుగా కుర్చీతాత మిస్సింగ్.. ఎక్కడ దొరికాడంటే?

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణ లోపాలను ప్రజలకు వివరించడమే తమ ఉద్దేశమన్నారు.సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక పరిస్థితి, కరెంటుపై శ్వేతపత్రాలు విడుదల చేసినట్లే కాంగ్రెస్ పార్టీ కూడా లక్ష కోట్ల సాగునీటి ప్రాజెక్టుల విషయాన్ని ప్రజల ముందుంచాలని భావిస్తోంది. మేడిగడ్డ వైఫల్యానికి తాము బాధ్యులం కాదన్న ఎల్‌అండ్‌టీ ప్రకటనపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడిగడ్డలో పర్యటించిన రాహుల్ గాంధీ సమక్షంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ ఘటనలో కుట్రపూరితంగా కేసులు పెట్టారని, వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వాస్తవ పరిస్థితులను తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అప్పటి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. కేటీఆర్ చిన్న చిన్న విషయాలు, ఆ విషయాలు బయటకు తీసి ప్రజలందరి ముందు పెడతాము. ఏం జరిగిందో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
Orey Trending: రేయ్ ఏంట్రా ఇది.. మహేష్ పాట ప్రోమో రిలీజ్.. ట్రేండింగ్ లో ఒరేయ్!

Show comments