Site icon NTV Telugu

పరిశ్రమలు, ఐటీ శాఖలపై కేటీఆర్ సమీక్ష

KTR

KTR

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్.. ఆయా రంగాల వారీగా పరిశ్రమలు మరియు ఐటీ శాఖ విభాగాధిపతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని, ఈ మేరకు పలు కంపెనీలు తమ ఆసక్తిని వివిధ శాఖల అధికారులకు తెలియజేశాయని ఈ సందర్భంగా అధికారులకు వివరించారు మంత్రి కేటీఆర్.. అయితే, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని, ఆ మేరకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉన్నదని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదిత పెట్టుబడులను వివిధ జిల్లాలకు తరలించేలా ఆయా కంపెనీలను కోరాలని సూచించారు. ఇప్పటికే, పలువురు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వానికి అందజేశారని, అటువంటి ప్రాంతాలకు ఈ పెట్టుబడులు తరలి వెళ్లేలా ప్రయత్నించాలని వివిధ శాఖల డైరెక్టర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు.

Exit mobile version