NTV Telugu Site icon

రూపాయికే నల్లా కనెక్షన్‌.. దసరా వరకు అందరికీ తాగునీరు..

KTR

KTR

రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తామని మరోసారి వెల్లడించారు మంత్రి కేటీఆర్.. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు పంపిణీ చేసిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.. వేములవాడలో ఎంత చేసినా తక్కువే.. వేములవాడ పట్టణంలో ఇంటి ఇంటికి నల్ల నీరు 60 శాతం పూర్తి అయ్యిందని.. దసరా వరకు పూర్తి చేసి అందరినీ త్రాగునీరు అందిస్తామన్నారు.. ఇక, 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇస్తామని తెలిపారు.. రైతు బజార్ నిర్మాణానికి 5 కోట్లు మంజూరు చేశామన్న ఆయన.. వైకుంఠదామానికి కోటి 50 లక్షలు కేటాయించామని.. ఎస్సీ కాలనీలో 25 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతుందని.. 100 పడకల ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని.. వంద పడకల ఆసుపత్రిలో 40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్.