Site icon NTV Telugu

రాజీపడే ప్రసక్తే లేదు.. ఏపీతోనే కాదు.. దేవుడితోనూ కొట్లాడతాం..!

KTR

KTR

కృష్ణా జలాల విషయం ఏపీ, తెలంగాణ మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది… ఇక, నీటి వివాదంపై ఇవాళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన.. ఏపీతోనే కాదు.. దేవుడితో కొట్లాడతాం.. చట్టప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటాం అన్నారు.. కేసీఆర్‌ నాయకత్వంలో ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని.. ఎవరెన్ని రకాలుగా అడ్డుకున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేస్తామని ప్రకటించారు.. నారాయపేటలో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఒక్కటైన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అమలు అవుతున్నాయా? అని ప్రశ్నించారు కేటీఆర్.. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ పథకాలు పక్కనే ఉన్న కర్ణాటకలో అమలు అవుతున్నాయా? ఒక్కసారి నారాయణ పేట ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.. భారత దేశంలో అత్యధికంగా వరి పంట పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్న ఆయన.. ఊహించని విధంగా వరి పంట పండింది… రైతుల దగ్గర పంట కొన్నాం అన్నారు.. ఇక, 10 కోట్ల రూపాయలతో టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని.. చేనేత బీమా పథకాన్ని సీఎం ప్రకటించారని గుర్తుచేశారు కేటీఆర్.. గతంలో 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి.. నేడు రోజు తప్పించి రోజు మంచినీరు అందిస్తున్నామన్న ఆయన.. పాలమూరులోని ప్రతి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.. సీఎం కేసీఆర్ ఉండగా పాలమూరు జిల్లాకు అన్యాయం జరగనివ్వరని.. దేవుడితో కొట్లాడి అయినా మీకు కృష్ణ నీళ్లు అందిస్తారని తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ను శరవేగంగా పూర్తి చేస్తాం… వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతాం అన్నారు కేటీఆర్.. జిల్లా ను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు… కలెక్టరేట్, ఎస్పీ భవనాల నిర్మాణం కూడా చేపడతాం… 338 కోట్లు పంచాయతీలకు, 148 కోట్ల నిధులు మున్సిపాలిటీలకు విడుదల చేస్తామన్నారు.

Exit mobile version