సీఎం కేసీఆర్ న్నాయకత్వంలో తెలంగాణలో చిరస్మరణీయంగా కొన్ని పథకాలు నిలిచిపోయాయి అని ప్రశంసలు కురిపించారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మల్కాపేటలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చల్మెడ జానకి దేవి స్మారకార్థం సుమారు రూ. 2 కోట్లతో నిర్మించిన పాఠశాల భవనాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. విపక్షాలపై విరుచుకుపడుతూనే రాష్ట్రంలో అమలు అవుతోన్న సంక్షేమ పథకాలను వివరించారు.
Read Also: Etela Rajender: కేసీఆర్‌కి క్షణం కూడా సీఎంగా కొనసాగే అర్హత లేదు..!
దేశంలోనే తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అని తెలిపారు మంత్రి కేటీఆర్.. రైతు బంధు, రైతు భీమా అందిస్తున్నాం.. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పని ఇంటికీకి నల్లా నీరు ఇస్తున్నాం అన్నారు. ప్రతి పేదవాడికి రూ.2000 పెనన్స్ ఇస్తున్నాం, మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 7300 పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో మొట్ట మొదటి పాఠశాల మల్కాపేట పాఠశాల కావడం విశేషం అన్నారు. ఇక, 4 లక్షల మందికి పైగా జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ చేశాం.. పేద వాడికి విద్య వైద్యం ముఖ్యం.. ఆ ఆదిశగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. మా నాయనమ్మ ఊరు కామారెడ్డి దగ్గరలో సొంతంగా నిర్మిస్తున్నాం.. అలాగే, మా అమ్మమ్మ ఊరు కోదురుపాకలో నిర్మిస్తాను అని ప్రకటించారు కేటీఆర్.
ఇక, రాష్ట్రంలోనే విద్య వైద్యలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉండాలని ఆకాక్షించారు మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో విద్య కోసం సర్కార్ పెద్ద పీట వేస్తుందన్న ఆయన.. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నెలకొల్పి లక్షల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాం అన్నారు. తెలంగాణ వస్తే ఏమి వస్తుంది? అన్నారు.. తెలంగాణ వస్తే నీళ్లు వచ్చాయని తెలిపారు. పక్కనే ఉంది మల్కాపేట రిజర్వాయర్.. పూర్తి కాగానే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం.. ముంపు గ్రామాల సమస్యలను కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు మంత్రి కేటీఆర్.