Site icon NTV Telugu

Liquor Shop Draw: మద్యం షాపుల డ్రాకు తొలగిన అడ్డంకులు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

Liquor Shop Draw

Liquor Shop Draw

Liquor Shop Draw: తెలంగాణలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి హైకోర్టు కీలక అనుమతి ఇచ్చింది. దీంతో మద్యం షాపుల డ్రా నిర్వహణకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 27న (సోమవారం) డ్రా నిర్వహించడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మద్యం షాపుల డ్రాకు హైకోర్టు నుంచి అనుమతి లభించడంతో, డ్రా ఏర్పాట్లను పూర్తి చేయాల్సిందిగా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ సి. హరికిరణ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 2,620 మద్యం షాపుల కోసం భారీ స్థాయిలో 95,137 దరఖాస్తులు వచ్చాయి.

Cardamon Benefits: రోజుకు రెండంటే.. రెండు చాలు.. ఆరోగ్యమే కాదు.. శృంగార జీవితంలోను..!

మద్యం షాపులకు వచ్చిన ఈ దరఖాస్తులను డ్రా (లాటరీ) పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. జిల్లాల వారీగా ఈ నెల 27న ఉదయం 11 గంటలకు దరఖాస్తుదారులు, ప్రజల సమక్షంలో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా మద్యం షాపుల డ్రా ప్రక్రియ కొనసాగనుంది. ఈ డ్రా ద్వారా కొత్త లైసెన్స్‌దారుల ఎంపిక జరగనుంది. ఇక ఏ జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న వివరాలు ఇలా ఉన్నాయి.

AI Robots: ప్రాణాలను కాపాడే AI రోబో!.. USలోని సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం సంచలనం

అదిలాబాద్‌లో 40 మద్యం షాపులకు 771 దరఖాస్తులు, కోమురం భీం అసిఫాబాద్‌లో 32 షాపులకు 680, మంచిర్యాలలో 73 షాపులకు 1712, నిర్మల్‌లో 47 షాపులకు 3002, జగిత్యాలలో 71 షాపులకు 1966, కరీంనగర్‌లో 94 షాపులకు 2730, పెద్దపల్లి 77 షాపులకు 1507, రాజన్న సిరిసిల్లలో 48 షాపులకు 1381, ఖమ్మంలో 122 షాపులకు 4430, కొత్తగూడెం 88 షాపులకు 3922, జోగులాంబ గద్వాలలో 36 షాపులకు 774, మహబూబ్‌నగర్‌లో 90 షాపులకు 2487, నాగర్‌కర్నూల్‌లో 67 షాపులకు 1518, వనపర్తిలో 37 షాపులకు 757, మెదక్‌లో 49 షాపులకు 1920, సంగారెడ్డి 101 షాపులకు 4432, సిద్దిపేటలో 93 షాపులకు 2782, నల్లగొండ 155 షాపులకు 4906, సూర్యపేట్‌లో 99 షాపులకు 2771, యాదాద్రి భువనగరిలో 82 షాపులకు 2776, కామారెడ్డి 49 షాపులకు 1502, నిజామాబాద్‌ 102 షాపులకు 2786, మల్కాజిగిరిలో 88 షాపులకు 5168, మేడ్చల్‌లో 114 షాపులకు 6063, సరూర్‌నగర్‌లో 134 షాపులకు 7845, శంషాబాద్‌లో 100 షాపులకు 8536 వికారాబాద్‌ 59 షాపులకు 1808, జనగామాలో 47 షాపులకు 1697, భూపాలపల్లి 60 షాపులకు 1863, మహాబూబబాద్‌లో 59 షాపులకు 1800, వరంగల్‌ రూరల్‌లో 63షాపులకు 1958, వరంగల్‌ అర్బన్‌లో 65 షాపులకు 3175 దరఖాస్తులు వచ్చాయి.

Exit mobile version