Wines Tender : తెలంగాణలో కొత్త మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ చివరి దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ నేడు ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా నిర్దేశిత కౌంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం ఉంది. గత వారం బీసీ బంద్ , కొన్ని బ్యాంకుల మూసివేత కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయామంటూ వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ, అసలు గడువును రెండు రోజుల పాటు పొడిగిస్తూ అక్టోబర్ 23 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, అక్టోబర్ 18 నాటికి మొత్తం 89,344 దరఖాస్తులు స్వీకరించగా, బుధవారం నాటికి ఆ సంఖ్య 90,316కు చేరుకుంది. చివరి రోజున భారీగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉన్నందున, జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు, సాంకేతిక సిబ్బంది, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సారి మద్యం షాపుల కేటాయింపును పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన అనంతరం అక్టోబర్ 27న లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు జరగనుంది. ఈ లాటరీ కార్యక్రమాన్ని సంబంధిత జిల్లా కేంద్రాల్లో ప్రజల సమక్షంలో, వీడియో రికార్డింగ్ సహితంగా నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఇదే సమయంలో, మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత లైసెన్సు కాలంలో కంటే ఈసారి దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండటం, వ్యాపార వాతావరణం మెరుగుపడటానికి సంకేతమని వారు అభిప్రాయపడ్డారు.
CM Chandrababu: దుబాయ్‌లో చంద్రబాబు రోడ్ షో.. రాష్ట్రాన్ని ఆవిష్కరించిన సీఎం..
