Telangana Liberation Day on September 17: తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని భారీగా జరపాలని బీజేపీ నిర్ణయించింది. 2022 సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17వరకు ఏడాది పాటు తెలంగాణ విముక్తి వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో కలపబడి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనుంది బీజేపీ పార్టీ. 2023 సెప్టెంబర్ 17న 75వ తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవం తరహాలోనే తెలంగాణ విముక్తి ఉత్సవాలు జరిపేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. విముక్తి సమయంలో నెలకొన్న సామాజిక, రాజకీయ, చారిత్రక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు నేతలు.
సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలకు బీజేపీ జాతీయ నాయకులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. ఇకపై తెలంగాణ విమోచన దినోత్సవం అని కాకుండా తెలంగాణ విముక్తి దినోత్సవం అనాలని బీజేపీ నిర్ణయించింది.
Read Also: వివిధ దేశాలకు అధినేతలైన భారత సంతతి వ్యక్తులు వీరే..
గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లలే అభివృద్ధి చెందుతున్నాయి: రఘునందన్ రావు.
తెలంగాణలో గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లలే అభివృద్ధి చెందుతున్నాయని.. వేరే అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి పై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అసంపూర్తిగా ఉందని..కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కొనసాగించకుంటే కల్వకుర్తి నుండి ప్రగతి భవన్ ని పాదయాత్రగా ముట్టడిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులపై రాష్ట్రంలో ఏ అంబేద్కర్ విగ్రహం దగ్గర చర్చకు సిద్ధమా.? అని టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన నడుస్తుందని వెంటనే కేటీఆర్, హరీష్ రావు రాజీనామా చేసి ఆ పదవులను బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోెకి రాగానే దళిత అభ్యర్థిని రాష్ట్రపతి చేసిందని.. స్వతంత్ర భారతంలో ఒక గిరిజ మహిళని రాష్ట్రపతి చేస్తున్న ఘటన బీజేపీదే అని ఆయన అన్నారు.
