Site icon NTV Telugu

Telangana: సీడబ్ల్యూసీకి తెలంగాణ లేఖ.. ఆ రెండు ప్రాజెక్టులపై ఫిర్యాదు..

Telangana

Telangana

సీడబ్ల్యూసీకి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది.. కేంద్ర జలసంఘంలోని ప్రాజెక్టు అప్రైజల్ డైరెక్టరేట్ కు లేఖ రాశారు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్.. కర్ణాటక చేపట్టిన అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఆ రెండు ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.. అంతర్ రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్ తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా అనుమతులు ఇవ్వరాదని సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లింది తెలంగాణ.. రెండు ప్రాజెక్టులకు అనుమతులతో కృష్ణాకు తుంగభద్ర నుంచి ప్రవాహాలు భారీగా తగ్గుతాయని ఆవేదన వ్యక్తం చేసింది.

Read Also: Ntv Health: జ్ఞానదంతాలతో “జ్ఞానం” వస్తుందా..?

ఆ రెండు ప్రాజెక్టులు రాష్ట్ర ప్రయోజనాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని లేఖలో పేర్కొన్న ఈఎన్సీ… అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులు చేయలేదని తెలిపింది.. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయింపులు చేసినప్పటికీ సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయన్న విషయాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.. అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే సమయంలో దిగువ రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది తెలంగాణ ఈఎన్సీ.

Exit mobile version