NTV Telugu Site icon

Harish Rao: 42 పేజీలు బుక్ ఇచ్చి.. నాలుగు నిమిషాలు కాలేదు.. అప్పుడే చర్చ

Harish Rao Assembly

Harish Rao Assembly

Harish Rao: 42 పేజీలు బుక్ ఇచ్చి..నాలుగు నిమిషాలు కాలేదు అప్పుడే చర్చ? అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ఇక నాలుగు రోజుల విరామం తర్వాత ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దినిమిషాల్లోనే సభ అరగంటపాటు వాయిదా వేశారు. కాగా.. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాసరెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కుంజా సత్యవతిలకు సభ సంతాపం తెలిపింది. అనంతరం గడ్డం ప్రశాద్ మాట్లాడుతూ.. ఎవరు ఎవరికి కించపరిచినట్లు మాట్లాడకూడదని విజ్ఞప్తి చేశారు. శాసన సభలో అందరూ ఒకరినినొకరు మర్యాద పూర్వకంగా మాట్లాడాలని కోరారు. సభను మరింత హుందాగా నడపాలని కోరారు. మూడో శాసన సభ లో 57 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారని తెలిపారు. ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు.. రన్నింగ్ కామెంట్స్ చేయకండి అన్నారు. అనుభవజ్ఞులైన సభ్యులు .. కొత్త వారికి ఆదర్శంగా ఉండాలన్నారు. శాసన సభలో అందరూ మాట్లాడే మాటలు ప్రజలందరికి ఆదర్శప్రాయంగా కావాలని కోరారు. అనంతరం ముందుగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడాలని స్పీకర్ కోరారు.

Read also: Extra Ordinary Man: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఎక్కడ స్ట్రీమింగంటే?

భట్టి, శ్రీధర్ బాబు మాటలు..

ముందుగా ఇక డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు.. దశాబ్ద కాలం పాలించిన గత పాలకులు.. అన్ని వనరులను అనుకున్న దిశగా నడిపించలేదన్నారు. రోజు వారి ఖర్చులు కూడా లేకుండా చేశారు. ఇలాంటి దుస్థితి రావడం బాధాకరమన్నారు. ఆర్థిక ఆరాచకత్వం జరిగిందన్నారు. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే మేము ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పాలన్నారు. మార్పు కోరుతూ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. వారికి కూడా ఆర్థిక పరిస్థితి తెలియ చేయాలని మేము శ్వేతపత్రం విడుదల చేస్తున్న అన్నారు. ఇక ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గతంలో కూడా డిస్కషన్ మొదలు ఐనప్పుడే మాకు నోట్ ఇచ్చారని తెలిపారు. మేము కూడా ఇదే విషయం అక్కడ ఉన్నప్పుడు చెప్పామన్నారు. హరీష్ సూచన పరిగణలోకి తీసుకుంటామన్నారు.

హరీష్ రావు.. అక్బరుద్దీన్..

సభలో పెట్టగానే చర్చ అంటే ఎలా? అని హరీష్ రావు ప్రశ్నించారు. సభ్యుల హక్కులు కాపాడాలి మీరు అన్నారు. ప్రొటెస్ట్ చేసే హక్కు సభ్యులకు ఇవ్వాలని కోరారు. మా హక్కులు కాపాడండి అన్నారు. ఇక మరోవైపు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. 42 పేజీలు ఇచ్చారు.. ఇది చదువుకోవాలంటే టీ బ్రేక్ అయినా ఇవ్వండని కోరారు. ప్రిపేర్ కాకుండా ఇంత ప్రాధాన్యత అంశంపై చర్చ చేయలేమన్నారు. టీ బ్రేక్ కనీనం 40 నిమిషాలు ఇస్తే మేము చదువుకుని ప్రశ్నించే విధంగా ఉంటుందని తెలిపారు. అనంతరం శాసనసభలో అరగంట పాటు సమావేశాలు వాయిదా పడ్డాయి..
Extra Ordinary Man: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఎక్కడ స్ట్రీమింగంటే?