Site icon NTV Telugu

Harish Rao: ప్రభుత్వ వైద్య సేవలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానం

Harish Rao

Harish Rao

Harish Rao: ప్రభుత్వ వైద్య సేవలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పెరిగిన డిస్పెన్సరీల ప్రకారం అత్యంత పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఒకేరోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించామని, ఇది దేశంలోనే వైద్య విద్యలో రికార్డు అని అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో కొత్తగా నియమితులైన 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు మంత్రి హరీశ్‌రావు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. 1331 మంది ఆయుష్ కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేశామన్నారు. 2014 నుంచి వైద్యారోగ్య శాఖలో 22,263 మందిని నియమించినట్లు తెలిపారు. రానున్న 2 నెలల్లో 9,222 కొత్త పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ వైద్య సేవల్లో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో ప్రస్తుతం 54 రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జూన్ నుంచి 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో కొత్తగా 9 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని, ఒక్కో కాలేజీకి దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

నోటిఫికేషన్ విడుదలైన ఐదు నెలల్లోనే వైద్యారోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసింది. నిరుడు డిసెంబర్ 6న 1,147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 34 విభాగాల్లో ఈ ఖాళీలను ప్రకటించారు. మల్టీ జోన్-1లో 574 పోస్టులు, మల్టీ జోన్-2లో 573 పోస్టులు ఉన్నాయి. డిసెంబర్ 20 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తుల స్వీకరణ.. ఫిబ్రవరి 2 నుంచి దరఖాస్తుల పరిశీలన, సర్టిఫికెట్ల పరిశీలన.. 20న రోస్టర్ జాబితా ప్రకటించారు. మార్చి 28న ప్రాథమిక మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించారు. సమర్పణలను పరిశీలించి 8వ తేదీన తుది జాబితాను విడుదల చేశారు. వారిలో 1,061 మంది ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం. కొత్తగా రిక్రూట్ అయిన వారంతా DME కింద పని చేస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తోంది. ఆయా కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మెడిసిన్ విభాగం ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలు చేపట్టింది. దీంతో వైద్య కళాశాలల్లో సిబ్బందిని నియమించారు. ఈ నియామకాలతో రాష్ట్రంలో వైద్య విద్య మరింత పటిష్టం కానుంది.
GHMC: నగరంలో రోడ్ల తవ్వకాలపై నిషేధం.. తక్షణమే అమల్లోకి రానున్న ఆదేశాలు

Exit mobile version