NTV Telugu Site icon

కేఆర్‌ఎంబీకి తెలంగాణ మరో లేఖ.. ఆ పని చేయండి..!

KRMB

KRMB

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదుల పర్వానికి ఇప్పట్లో తెర పడేలా కనిపించడం లేదు.. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదాల పరిష్కారానికి ఇటు కృష్ణానది యాజమాన్య బోర్డు, అటు గోదావరి నది యాజమాన్య బోర్డు పరిధిలను నిర్ణయిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసినా.. ఇంకా పులిస్టాప్‌ పడే దాఖలాలు కనిపించడంలేదు.. ఇవాళ కేఆర్‌ఎంబీకి మరో లేఖరాసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. రాజోలిబండ హెడ్ వర్క్స్ ను కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఆ లేఖలో పేర్కొంది.. ఇకచ ఉమ్మడి రాష్ట్రం ఆమోదించిన ఆనకట్ట ఆధునికీకరణ పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్సీ మురళీధర్‌.. కేఆర్‌ఎంబీకి చైర్మన్‌కు రాసిన లేఖలో కోరారు.