TG Inter Board : ఇంటర్ పరీక్షల్లో పెను మార్పులు.? భాషా సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు.!
- ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు
- ఆర్ట్స్ గ్రూప్‌లు, భాషా సబ్జెక్టులకు 20 మార్కుల ఇంటర్నల్ ప్రాజెక్టులు
- 2025-26 నుంచి సిలబస్, పరీక్షా విధానంలో మార్పులు
- ప్రభుత్వం అనుమతిస్తే ఈ ఏడాది నుంచే కొత్త నిబంధనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Inter Board : తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ విద్యలో పలు మార్పులను ప్రతిపాదించింది. ఆర్ట్స్ గ్రూప్‌లతో పాటు భాషా సబ్జెక్టుల్లో కూడా ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు భావిస్తోంది. మొత్తం 100 మార్కుల్లో 20 మార్కులను ప్రాజెక్టులు లేదా అసైన్మెంట్ల రూపంలో ఇంటర్నల్‌గా కేటాయించి, మిగతా 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.
ప్రభుత్వం ఆమోదం ఇస్తే, సైన్స్ గ్రూప్‌లతో పాటు ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు కూడా 20 మార్కుల ప్రాజెక్ట్ వర్క్ తప్పనిసరి కానుంది. ఇప్పటికే 2023-24 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సబ్జెక్టులో 20 మార్కుల ప్రాక్టికల్స్ అమల్లో ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్‌లో కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు.
Also Read
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ఇక ఈ ప్రతిపాదనల ప్రకారం భవిష్యత్తులో అన్ని భాషా సబ్జెక్టుల్లోనూ ఇంటర్నల్ మార్కులు అమలు చేయనున్నారు. దీంతో హెచ్ఈసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌లలోని ప్రతి సబ్జెక్టుకు 20 ఇంటర్నల్ మార్కులు కేటాయించబడతాయి. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేయడం పాటు పరీక్షల విధానంలోనూ ఈ మార్పులను చేర్చాలని బోర్డు యోచిస్తోంది.
పాఠ్య ప్రణాళిక రివిజన్ కమిటీ నిపుణుల సిఫారసుల ఆధారంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం అనుమతిస్తే ఈ ఏడాది నుంచే పరీక్షల విధానంలో కొత్త మార్పులు అమల్లోకి రావచ్చు.
AP Metro Rail Projects: విజయవాడ, వైజాగ్ మెట్రో రైల్‌కు రంగం సిద్ధం.. రేపే టెండర్లు..!
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!