NTV Telugu Site icon

Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. తేదీని వెల్లడించిన అధికారులు

Telangana Inter Results

Telangana Inter Results

Telangana Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త అందించింది. ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 24న ఇంటర్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అదే రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను అధికారులు ఒకేసారి ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Read also: Tirumala: నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు

దీంతో.. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 46,542 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 10 నుంచి మూల్యాంకనం నిర్వహించి ఏప్రిల్ 10న పూర్తి చేసి మార్కుల నమోదుతోపాటు సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మూడుసార్లు జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాత కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ పూర్తయింది. గతేడాది మే 9న ఫలితాలు ప్రకటించగా.. ఈసారి 15 రోజుల ముందే ఫలితాలు వెల్లడికానున్నాయి.

Read also: Memantha Siddham: 20వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే..

ఫలితాలను ఇలా చూడొచ్చు..

* ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి- (tsbie.cgg.gov.in)
* అక్కడ మీరు హోమ్‌పేజీలో ‘TSBIE 2024 ఫలితం’ లింక్‌పై క్లిక్ చేయాలి.
* విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయాలి.
* ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
* ఫలితాలను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
Tirumala: నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు