Site icon NTV Telugu

Inter Hall Tickets : తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు వచ్చేశాయి! డౌన్ లోడ్ లింక్ మీ మొబైల్ కే.. పూర్తి వివరాలివే.!

Inter Board

Inter Board

Inter Hall Tickets : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హాల్ టికెట్ల ప్రక్రియ పూర్తయింది. మార్చి 2026లో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల హాల్ టికెట్లను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది దాదాపు 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండటంతో, బోర్డు అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 25, 2026 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హాల్ టికెట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే, విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయంతో పాటు, వారి సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్ల నుండి ధ్రువీకరించిన హాల్ టికెట్లను తీసుకోవాలని బోర్డు సూచించింది. విద్యార్థుల సౌకర్యార్థం వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే లింక్‌ను SMS ద్వారా కూడా పంపుతున్నారు.

2028 T20 Worldcup.. డైరెక్ట్ ఎంట్రీ సాధించిన 12 జట్లు..!

ఈసారి సాంకేతికతను జోడిస్తూ బోర్డు కీలక మార్పులు చేసింది. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా , ఖచ్చితంగా గుర్తించడానికి వీలుగా హాల్ టికెట్లపై QR కోడ్ ను ముద్రించారు. దీనిని స్కాన్ చేయడం ద్వారా సెంటర్ లొకేషన్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ హాల్ టికెట్‌లో పేరు, ఫోటో, సంతకం లేదా సబ్జెక్టులకు సంబంధించి ఏవైనా తప్పులు ఉంటే, వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ ద్వారా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు హెచ్చరించారు.

పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హాల్ టికెట్లు అందిన వెంటనే అన్ని వివరాలు సరిచూసుకోవడం, పరీక్షా కేంద్రాన్ని ఒక రోజు ముందే సందర్శించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు నుంచే ప్రారంభం కానున్న ఈ వార్షిక పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేంద్రాలను సిద్ధం చేశారు.

Miracle Movie: హెబ్బా పటేల్ కొత్త సినిమా.. ‘మిరాకిల్’ చేద్దాం రండంటున్న హాట్ బ్యూటీ!

Exit mobile version