Site icon NTV Telugu

Telangana Hotels on Strike: తెలంగాణలో హోటల్స్ బంద్.? గ్యాస్ సెగతో అసోసియేషన్ కీలక నిర్ణయం..!

Gas

Gas

Telangana Hotels on Strike: తెలంగాణ రాష్ట్రంలోని హోటల్ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. అంతర్జాతీయ యుద్ధ పరిణామాల నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లను మూసివేసి (బంద్) నిరసన తెలపాలని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ యోచిస్తోంది. దీనిపై చర్చించేందుకు హైదరాబాద్‌లో అసోసియేషన్ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమయ్యారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్, యూఎస్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిందని, అది ఇప్పుడు హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని అసోసియేషన్ వెల్లడించింది. ఇప్పటికే బెంగళూరు , ముంబై వంటి నగరాల్లో హోటల్ యజమానులు బంద్ నిర్వహిస్తుండగా, అదే బాటలో తెలంగాణలో కూడా కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించనున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా లేకపోవడంతో వినియోగదారులకు కనీసం వంట చేసి పెట్టే పరిస్థితి కూడా లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Israel-Lebanon: లెబనాన్‌‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు.. హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా ఎటాక్

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. హోటల్ పరిశ్రమకు గ్యాస్ అనేది ప్రాణవాయువు వంటిదని పేర్కొన్నారు. “ప్రస్తుతం గ్యాస్ నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. హోటళ్లలో పని చేసే సిబ్బందికి కూడా వంట చేసి పెట్టేంత గ్యాస్ నిల్వలు లేని దుస్థితి ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. లేనిపక్షంలో హోటళ్లను శాశ్వతంగా మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది” అని ఆయన హెచ్చరించారు.

ఈ సమావేశం ద్వారా తమ సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, తదుపరి ఏ విధమైన ఆందోళనలు చేపట్టాలనే దానిపై అసోసియేషన్ ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తోంది. గ్యాస్ సరఫరా పునరుద్ధరించకపోతే ప్రజలకు ఆహారం అందించడం అసాధ్యమని, ఇది పరోక్షంగా వేలాది మంది కార్మికుల ఉపాధిపై కూడా ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

BCCI Cash Reward: రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!

Exit mobile version