NTV Telugu Site icon

కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ…ఆగ్రహం 

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.  మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె,ప్రస్తుత కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్నది.  తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని హైకోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది.  తాజాగా మరోసారి ఈరోజు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది.  సరిహాద్దుల్లో అంబులెన్స్ ను అడ్డుకోవడంపై కూడా హైకోర్టు మండిపడింది.  అంబులెన్స్ ను ఎవరు అడ్డుకోమన్నారని ప్రశ్నించింది.  ఇక పాతబస్తీలో నిబంధనలు పాటించడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  హైకోర్టు విచారణకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు హాజరయ్యారు.