High Court Orders To Shift MLA Bride Case From SIT To CBI: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చింది. సిట్ విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. వెంటనే ఈ కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు వివరాల్ని సీబీఐకి అందజేయాలని పేర్కొంది. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత.. సిట్ విచారణ సరిగా జరగట్లేదన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్యేల ఎర కేసు విచారణని సీబీఐకి అప్పగించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ వేసిన పిటిషన్‌ని మాత్రం న్యాయస్థానం కొట్టివేసింది. నందకుమార్, శ్రీనివాస్‌తో పాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్లకు అనుమతి ఇస్తూ.. ఈ తీర్పుని కోర్టు వెల్లడించింది.
Cess Votes Counting: సెస్ ఎన్నికల లెక్కింపులో గందరగోళం.. బీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య గొడవ
ఏసీబీ చేయాల్సిన దర్యాప్తు సిట్ ఎలా చేస్తుందని పిటిషనర్స్ తమ వాదనలు తెలిపారు. నగదు లేనప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ ఎలా వర్తిస్తుందని.. ముఖ్యమంత్రి నేరుగా ఇన్వాల్వ్ అయ్యారని పిటిసనర్స్ వాదించారు. దర్యాప్తు ఎవిడెన్స్ సీఎం చేతికి ఎలా చేరాయని ప్రశ్నించారు. ఇందులో ఏదో కుట్రకోణం దాగి ఉందని, సంబందం లేని వారిని కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారని, సీబీఐతో దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగు చూస్తాయని పిటిషనర్స్ వాదించారు. పిటీషనర్స్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. కేసుని సీబీఐకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. అయితే.. హైకోర్టు ఆదేశాలను సిట్ అప్పీల్ చేయబోతోంది. కాగా.. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఓ కుట్ర జరిగిన సంగతి తెలిసిందే! మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ వ్యవహారం కొనసాగింది. అయితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో, వెంటనే రంగంలోకి దిగి నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగానే.. సీఎం కేసీఆర్ అప్పట్లో మునుగోడు ఉపఎన్నికలు ముగిసిన రోజే కొన్ని వీడియోలను విడుదల చేశారు.
ZPTC Mallesham Case: జెడ్‌పీటీసీ మల్లేశం కేసులో ట్విస్ట్.. అర్థరాత్రి నుంచే ప్లాన్