Site icon NTV Telugu

Telangana : తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిల నియామకం

High Court

High Court

Telangana : తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు కోలీజియం ఇటీవల చేసిన సిఫారసులను ఆమోదిస్తూ, నలుగురు కొత్త జడ్జిల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హైకోర్టులో న్యాయ వ్యవస్థ మరింత బలపడనుందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Vangalapudi Anitha: వైఎస్ జగన్ ఎవరిని టచ్ చేయకూడదో.. వాళ్లనే టచ్ చేశారు!

ఈ నియామకాలతో గాడి ప్రవీణ్‌కుమార్‌, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్‌ మీరా మొహుద్దీన్‌ తదితరులు త్వరలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసుల ఆధారంగా న్యాయవాదుల అనుభవం, నిబద్ధత, న్యాయపరమైన ప్రతిభను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ ఎంపికలు జరిగాయి.

ఇటీవల కేసుల పెరుగుదలతో హైకోర్టులో న్యాయమూర్తుల కొరత సమస్యగా మారింది. ఈ కొత్త నియామకాలు కేసుల విచారణను వేగవంతం చేయడంలో, పెండింగ్ కేసుల క్లియరెన్స్‌లో సహాయపడతాయని న్యాయ నిపుణులు విశ్వసిస్తున్నారు.

2025 Women’s World Cup: కోనేరు హంపి ఓటమి.. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్‌!

Exit mobile version