Site icon NTV Telugu

Telangana High Court : రేపు హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం

Ujjal Bhuyan

Ujjal Bhuyan

రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భూయాన్‌ రేపు గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 10.45 గంటలకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమం రాజ్ భవన్ లో జరుగనుంది. అయితే.. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవు కావడం లేదు. ఇకపోతే… ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న సతీష్‌ చంద్రను ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వెళ్తున్నారు. ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version