Site icon NTV Telugu

హుస్సేన్‌ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు విచారణ…

TS High Court

వినాయక నిమజ్జనంపై తమకు వివరాలు సమర్పించాలని మరోసారి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారు… రసాయనాలతోకూడిన విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా చర్యలేమిటి అని ప్రశ్నించింది. ఇక సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. హుస్సేన్ సాగర్ లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిల్ పై విచారణ జరిపింది. ఇళ్లల్లోనే మట్టిగణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామన్న ప్రభుత్వ న్యాయవాదికి… సూచనలు కాదు.. స్పష్టమైన ఆదేశాలు ఉండాలని హైకోర్టు తెలిపింది. మతపరమైన సెంటిమెంట్లు మంచిదే కానీ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని పేర్కొన హైకోర్టు… వినాయక నిమజ్జనంపై తదుపరి విచారణ సెప్టెంబరు 1కి వాయిదా వేసింది.

Exit mobile version