NTV Telugu Site icon

Rangareddy: ప్రమోషన్లు ఇవ్వొద్దు.. రంగారెడ్డి టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే..

Telangana High Cort

Telangana High Cort

Rangareddy: రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 19 వరకు పదోన్నతులపై స్టే ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో ప్రాథమిక సీనియారిటీ జాబితాపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది డి.బాలకిషన్ రావు వాదించారు. ప్రిలిమినరీ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలకు తగిన సమయం ఇవ్వలేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. తగిన సమయం ఇవ్వకుండానే పదోన్నతులకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. అభ్యంతరాలను పరిశీలించాకే తుది సీనియారిటీ జాబితాను రూపొందిస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. తుది సీనియారిటీ జాబితా ఇవ్వకుండా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. వివరాలను సమర్పించేందుకు ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. ఈ క్రమంలో విద్యాశాఖ కార్యదర్శి, డీఎస్‌ఈ, రంగారెడ్డి డీఈవోలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు అనుమతి..

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల్లో ఉద్యోగ సంఘాల నేతలు, ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ దంపతులకు వారి సేవలకు పది పాయింట్లు అదనంగా ఇచ్చారు. ఫిబ్రవరిలో జరిగే వెబ్ కౌన్సెలింగ్‌లో 73,803 మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే భార్యాభర్తలు, ఉద్యోగ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన ధర్మాసనం… జియోపై స్టే విధిస్తూ మార్చి 14న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో.. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది.

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే ..

మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ టి. వినోద్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘంగా వాదించింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు చీకుడు ప్రభాకర్, పివి కృష్ణయ్య వాదించగా, ప్రభుత్వం తరపున అడిషనల్ ఎజి రామచంద్రరావు వాదించారు. నిబంధనల సవరణ చట్టం ప్రకారం జరగలేదని ప్రభాకర్ వాదించారు. జేఈవో ద్వారా నిబంధనలలో మార్పులు చేయడం కుదరదని న్యాయవాది కృష్ణయ్య హైకోర్టుకు తెలిపారు. భార్యాభర్తల కేటగిరీ అమలు చేయాల్సి వస్తే ప్రైవేట్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని వివరించారు. బదిలీలకు సంబంధించి నిబంధనలను రూపొందించే అధికారం ప్రభుత్వానికి ఉందని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు పేర్కొన్నారు.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు కేటాయించడం సబబు కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు కేటాయించడం సబబు కాదని అభిప్రాయపడింది. దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించేందుకు అనుమతించిన కోర్టు.. భార్యాభర్తలు కలిసి ఉండేలా నిబంధన పెట్టినట్లు తెలిపింది. అదనపు పాయింట్లను పక్కన పెట్టి బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, అన్ని బదిలీలు తుది తీర్పుకు లోబడి ఉంటాయి. హైకోర్టు ఆదేశాలతో దాదాపు 30 వేల మంది బదిలీలతో పాటు దాదాపు 9 వేల మందికి పదోన్నతులు లభించనున్నాయి.

Amit Shah: సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణకి విముక్తి లభించేది కాదు