Site icon NTV Telugu

పోడు భూములపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి నోటీసులు

తెలంగాణలో పోడు భూముల వ్యవహారం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఈ వ్యవహారంలో హైకోర్టుకు చేరింది.. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములపై హైకోర్టులో విచారణ జరిగింది.. వేలాది మంది ఆదివాసులను అడవి నుండి వెల్ల గొట్టడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.. చెరుకు సుధాకర్, పిల్ విశ్వేశ్వర్ రావు, అది వాసి పోరాట సమితి నేత శ్రవణ్.. విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు వాదనలు వినిపించారు చిక్కుడు ప్రభాకర్.. ఈ పిటిషన్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మ బెంచ్‌ విచారణ చేపట్టింది.. పోడు భూముల వ్యవహారంపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

Read Also: రేపే పీఆర్సీపై క్లారిటీ..!

Exit mobile version