Site icon NTV Telugu

HC Hearing on Bandi Sanjay Padayatra: బండి సంజయ్‌ పాదయాత్ర హైకోర్టులో విచారణ.. అనుమతిపై ఉత్కంఠ..!

Hc Hearing On Bandi Sanjay Padayatra

Hc Hearing On Bandi Sanjay Padayatra

HC Hearing on Bandi Sanjay Padayatra: ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రశక్తి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తెలిపిన విషయం తెలిసిందే. ఇవాళ ప్రజాసంగ్రామ యాత్ర పై నేడు హైకోర్టులో విచారణ ఉరపునున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. బండి సంజయ్ యాత్రను కొనసాగిస్తే శాంతి భద్రతల విగాథం కలుగుతుందని పోలీసులు కోర్టుకు తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా యాత్రలో బండి సంజయ్ ప్రసంగాలు చేస్తున్నట్టు ప్రభుత్వం కోర్ట్ కి తెలిపింది. దీంతో .. బండి సంజయ్ ప్రసంగాల వీడియోలతో పాటు ఈ యాత్రకు సంబంధించి నమోదైన కేసుల వివరాలను సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 2 నుంచి 26 వరకు బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్రను నిలిపివేయాలంటూ వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన నోటీసును బీజేపీ సవాల్ చేసిన విషయం తెలిసిందే.

యాత్రలో బండి సంజయ్ చేసిన ప్రసంగాల వీడియోలు, పోలీసుల కేసుల వివరాలను నేడు కోర్ట్ ముందు ప్రభుత్వం ఉంచునుంది. ఈకేసును ఉదయం 10.30 కి హైకోర్టు విచారణ చేయనుంది. హైకోర్టు విచారణతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. యాత్రను నిలిపివేయనుందా? లేక కొనసాగించాలని హైకోర్టు సమాధానం కోసం బీజేపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే రాజాసింగ్‌ ముస్లీంపై అనుచిత వ్యాఖ్యలపై పార్టీనే సస్పెండ్‌ వేటుకు గురైన విషయం తెలిసిందే. నిన్న బండి సంజయ్‌ పాదయాత్రను కరీంనగర్‌లో అడ్డుకోవడంతో.. ఇంటివద్దనే ఉదయం నుంచి మధ్యా్‌హ్నం వరకు దీక్ష నిర్వహించారు బండి సంజయ్‌. ఎందుకు పాదయాత్రను అడ్డుకున్నారని ప్రశ్నించారు. పాదయాత్రను ఆపే ప్రశక్తి లేదని స్పష్టం చేశారు.
Karnataka: టిప్పు సుల్తాన్ గూండా అన్న ఎమ్మెల్యే.. మరోసారి అంటే నాలుక కోస్తామని హెచ్చరిక

Exit mobile version