కరోనా మహమ్మారి ఎఫెక్ట్ కోర్టులపై కూడా పడింది.. ఆన్‌లైన్ పిటిషన్లు మాత్రమే స్వీకరించడం.. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విచారణ చేయడం లాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అయితే, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. క్రమంగా అన్ని తెరుచుకుంటున్నాయి.. ఈ తరునంలో.. కోర్టుల్లో అన్ లాక్ ప్రారంభించాలని నిర్ణయించింది హైకోర్టు.. సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది.. ఇప్పటి వరకు రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతుండగా.. ఈనెల 19 నుంచి కోర్టుల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయంచింది… ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలో పాక్షిక ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది… ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లోఈనెల 31 వరకు ఆన్ లైన్ విచారణ కొనసాగించాలని.. మిగతా ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 16 వరకు ఆన్ లైన్ విచారణ జరగాలని.. మిగతా జిల్లాల్లో ఈనెల 19 నుంచి పాక్షికంగా ప్రత్యక్షంగా విచారణ ప్రారంభించాలని పేర్కొంది.. ఇక, హైకోర్టులో ఈనెల 31వ తేదీ వరకు ఆన్ లైన్ విచారణ విధానం కొనసాగనున్నట్టు తెలిపారు.
కోర్టుల్లో అన్‌లాక్.. హైకోర్టు నిర్ణయం

High Court