Site icon NTV Telugu

Weather Updates : తెలంగాణకు అర్ధరాత్రి హై అలెర్ట్‌.. తీరాన్ని తాకిన ‘మొంథా’

Montha

Montha

Weather Updates : హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడి, ఈశాన్య దిశగా కదులుతున్న ‘మొంథా’ తుఫాన్‌ అర్ధరాత్రి తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపనున్నట్లు, ప్రత్యేకించి ఏపీతో పాటు.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ తొక్కలతో.. పెరుగును మరింత పోషకమైనదిగా చేసిన బిహెచ్‌యు శాస్త్రవేత్త

ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, ఈ రెండు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసినట్లు ఐఎండీ (IMD) తెలిపింది. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లరాదని సూచించింది. అలాగే, రాష్ట్రంలోని పలు ఇతర జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ కూడా ప్రకటించబడింది. వచ్చే గంటల్లో గాలివానలు, పిడుగులు, భారీవర్షాలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ హెచ్చరికలు ఉదయం 9 గంటల వరకు కొనసాగుతాయి అని ఐఎండీ తెలిపింది. వర్షాల తీవ్రతను బట్టి, అవసరమైతే మరిన్ని జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాలకు అప్రమత్తత సూచనలు పంపింది. తుఫాన్‌ కారణంగా రహదారులపై నీటిమునిగే ప్రమాదం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Pak-Afghan: శాంతి చర్చలు విఫలం.. మళ్లీ యుద్ధానికి దగ్గరగా ఆఫ్ఘాన్-పాక్

Exit mobile version