Site icon NTV Telugu

Weather Alert : తెలంగాణలో నాలుగు రోజుల పాటు కుండపోత వర్షాలు

Hyd Rain

Hyd Rain

Weather Alert : తెలంగాణ రాష్ట్రం మరోసారి భారీ వర్షాల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు. వర్షాల తీవ్రత దృష్ట్యా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. అధికారుల వివరాల ప్రకారం, రాష్ట్రంలోని అధికభాగం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల మాత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమయంలో వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, గాలి దిశల్లో మార్పులు చోటుచేసుకోవడం వర్షాల తీవ్రతను పెంచే అవకాశం ఉన్నట్లు సూచించారు.

Tejashwi Yadav: నితీష్‌కుమార్‌ ఆరోగ్యంగా ఉన్నారో లేదో అనుమానం.. వీడియో విడుదల చేసిన తేజస్వి యాదవ్

వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్న ప్రకారం, దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు అంతర్భాగాల వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. అదేవిధంగా, తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండు వ్యవస్థల ప్రభావం వల్లే ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఇప్పటికే ఆదివారం నాడు కూడా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల తాత్కాలికంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం, విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్లు దగ్గర నిలబడకూడదని హెచ్చరించింది. వ్యవసాయరంగానికి ఇది శుభవార్తగా మారవచ్చని, ముఖ్యంగా రబీ పంటలకు తగినంత తేమ అందే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

RRB NTPC 2025: రైల్వేలో కొలువుల జాతర.. 8850 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల

Exit mobile version