Talangana Rains: హైదరాబాద్ లో రాగల మూడు గంటలు చిరు జల్లులే పడే అవకాశం ఉందని, భారీ వర్షం పడే అవకాశాలు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం వరకు నగరానికి భారీ వర్షం లేదని వాతావరణ నిపుణులు తెలపడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ప్రజలకు సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా చర్యలను చేపట్టేందుకు రంగంలోకి దిగారు. నీళ్లల్లో మునిగిన ఇళ్లను, కాలనీలను పరిశీలిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రోడ్లపై వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
Read also: Revanth Reddy: ప్రజలను పట్టించుకోకుండా పత్తా లేకుండా పోయారు.. కేటీఆర్ కు రేవంత్ లేఖ
ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పలు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను అప్రమత్తం చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 48 గంటల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎస్ ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలన్నారు. పలు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
Liquor shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రాజధానిలో 4రోజులపాటు వైన్ షాపులు బంద్