Telangana Jobs : తెలంగాణలో ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల వేట మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1623 పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వివరాల ప్రకారం, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో 1616 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు, అలాగే ఆర్టీసీ హాస్పిటల్‌లో 7 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమై, 22వ తేదీ వరకు కొనసాగనుంది.
Gharana Mogudu : ‘ఘరానా మొగుడు’ మూవీకి చిరు రికార్డ్ రెమ్యునరేషన్..
ఈ నియామకాలతో జిల్లా ఆసుపత్రులు, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు (CHCs) లో వైద్య సేవలు మరింత మెరుగవనున్నాయి. పల్లెలకు దగ్గరగా స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు నేరుగా లాభం కలగనుంది. ఇప్పటికే ఆరోగ్యశాఖలో సుమారు 8 వేల పోస్టులను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, మరో 7 వేల పోస్టుల కోసం భర్తీ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకాలతో వైద్య రంగంలో పెద్ద ఎత్తున బలోపేతం కానుంది.
Chiranjeevi : చిరంజీవి పేరును అందుకే టైటిల్ గా పెట్టా.. అనిల్ కామెంట్స్
