Gurukula Recruitment: గురుకుల ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో అభ్యర్థుల ఫలితాలు, పోస్టింగులు
- తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఉపాధ్య పోస్టుల భర్తీ ప్రక్రియ
- ఇప్పటికే కొన్ని ఖాళీల భర్తీ ప్రక్రియ పూరైంది
- ఇంకా మిగిలిన పోస్టుల భర్తీకి గురుకుల సంఘాలు కసరత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurukula Recruitment: తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఉపాధ్య పోస్టుల భర్తీ ప్రక్రియ మళ్లీ ఊపందుకోనుంది. కానీ.. ఇప్పటికే కొన్ని ఖాళీల భర్తీ ప్రక్రియ పూరైంది. అయితే.. ఇంకా మిగిలిన పోస్టుల భర్తీకి గురుకుల సంఘాలు కసరత్తు ప్రారంభించారు. పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా వికలాంగ అభ్యర్థులకు నిర్వహించిన వైద్య పరీక్షల ఫలితాలు ఆలస్యం కావడంతో వీరికి మినహా మిగతా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని గురుకుల నియామక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేకపోయారు.
దీంతో ఈ అభ్యర్థులకు పోస్టు ద్వారా నియామక పత్రాలు పంపిస్తామని చెప్పినా, సార్వత్రిక ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ నేపథ్యంలో గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ , డిగ్రీ లెక్చరర్ పోస్టులతోపాటు దాదాపు 1600 పోస్టులకు సంబంధించిన పూర్తి ఫలితాలు, నియామక లేఖల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక.. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ గడువు ముగియడంతో.. వికలాంగ కేటగిరీ అభ్యర్థుల తుది ఫలితాలతో పాటు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులందరికీ అపాయింట్‌మెంట్ పత్రాలు ఇవ్వాల్సి ఉంది.
Also Read
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
ఈ నెలాఖరులోగా సాంకేతిక సమస్యలను అధిగమించి జూలైలో పోస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. గతేడాది చేపట్టిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని తాజాగా హైకోర్టు ఆదేశించింది. కాగా.. మరోవైపు బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (కన్వీనర్)గా ఉన్న మల్లయ్య భట్టు సర్వశిక్షా అభియాన్ పీడీగా బదిలీ అయ్యారు. ఈ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
తుది దశలో నియామక ప్రక్రియ..
* ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లోని 833 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల కోసం తుది కీతో పాటు జీఆర్‌ఎల్‌ను కమిషన్ విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేయాలి మరియు పత్రాలను పరిశీలించాలి.
* అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసింది. వికలాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.
* వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల కోసం అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితా (GRL) విడుదల చేయబడింది.
* పురపాలక శాఖలో అకౌంటెంట్ పోస్టుల కోసం ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది.
* భూగర్భ జలవనరుల శాఖలోని గెజిటెడ్ పోస్టుల కోసం ఇప్పటికే ధ్రువీకరణ పత్రాల పరిశీలనను కమిషన్ పూర్తి చేసింది. పోస్టుల ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు.
* టెక్నాలజీ విభాగంలో 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల కోసం కమీషన్ GRL ప్రకటించింది. ఈ పోస్టుల కోసం మెరిట్ జాబితాను సిద్ధం చేసి, పత్రాలను పరిశీలించాల్సి ఉంటుంది.
* ఇంటర్ ఎడ్యుకేషన్ విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫైనల్ కీ వెల్లడైంది. రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూన్‌లో జరగనుంది. వివిధ దశల్లో నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలని కమిషన్ భావిస్తోంది.
తాజావార్తలు
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!