Site icon NTV Telugu

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..

అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు నిన్న టీఎస్ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేత ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని, ఇవాళ్టి నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గమ్య స్థానములకు TSRTC బస్సులను నడుపనుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటు వంటి లాకడౌన్ నిబంధనలు అనుసరించి, ప్రతి రోజూ ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 6 గంటల లోపున ఈ సర్వీసులు రద్దీకీ అనుగుణంగా నడుపనుంది తెలంగాణ ఆర్టీసీ. అటు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటు వంటి లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి ఇవాళ్టి నుండి ఉదయం 5 గంటలు నుండి సాయంత్రం 7 గంటల వరకు ఇట్టి సర్వీసులు ( బెంగళూరు నకు మినహా) నడుపనుంది. వారాంతంలో కర్ఫ్యూ ఉన్నందున ( అనగా శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి సోమవారం ఉదయం 5 గంటల ) బస్ సర్వీసులు ఉండనున్నాయి. మహారాష్ట్రలోని గమ్యస్థానాలకు అక్కడి లాక్ డౌన్ నిబంధనలకు లోబడి మంగళవారము నుండి తెలంగాణ ఆర్టీసీ సర్వీసులు నడుపనుంది.

Exit mobile version