Anganwadi Jobs: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొలువుల భర్తీపైనే నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కొత్త ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గుడ్‌న్యూస్ తెలిపారు. రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ములుగులోని సఖి సెంటర్ ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చామన్నారు. మహాలక్ష్మి పథకంపై ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Read also: Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్.. నేడు విచారణ
కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ తమ సంఘాలతో చర్చించిన తర్వాతే ఈ హామీని ప్రకటించారు. ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. త్వరలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,204 సిబ్బంది పోస్టులకు 1,890 కలిపి 7,094 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. గతేడాది డిసెంబర్ 30న 5,204 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటితో పాటు మరో 1,890 పోస్టులు జోడించి మొత్తం 7,094 పోస్టుల భర్తీకి రాష్ట్ర వైద్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు అనుమతించింది. మండలాల వారీగా పోస్టుల వివరాలను వెల్లడించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే కసరత్తు మొదలైంది.
Rishabh Pant IPL Auction: ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే తొలి కెప్టెన్‌గా రిషబ్ పంత్ రికార్డు!