Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ నేత నిరంజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. భూపాలపల్లి జిల్లా మహదేవపురం పీఎస్‌లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషనర్ కోరారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలడంపై కూడా పిటిషనర్ సందేహాలు లేవనెత్తారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అస్త్రంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, అవినీతి జరిగాయని గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. కాళేశ్వరంపై న్యాయ విచారణతో పాటు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
Read also: Prajavani: మొదలైన ప్రజావాణి.. వినతులు స్వీకరిస్తున్న అధికారులు
కాళేశ్వరం నిర్మాణ సమయంలో గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో.. ఇప్పుడు అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రేవంత్ రెడ్డి ఇవ్వాలని నిర్ణయించారు. తన రివెంజ్ ప్లాన్‌లో భాగంగా ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని ఏ వేదిక నుండి చెప్పాడో అదే వేదికపై ప్రాజెక్ట్ బలహీనతను వివరించాలనుకుంటున్నాడు. మేడిగడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఎల్ అండ్ టీ ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేయబోమని ఎల్ అండ్ టీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎల్ అండ్ టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారికి లేఖ రాసి తమ ప్రమేయం లేదని చెబుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృధా చేసిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.