Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy: తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ.. కాంగ్రెస్‌ ని గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలి..

Pogulety Srinivas Reddy

Pogulety Srinivas Reddy

Ponguleti Srinivas Reddy: తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ, కాంగ్రెస్‌ని గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలని టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీలో భట్టి విక్రమర్క అక్రమాల వివరాలు చెబుతుంటే అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎన్ని కష్టాలు వచ్చినా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఐదు పోగులు వేస్తే పాతవారు మూడు పోగులు తీసుకోండి.. నాకు.. నన్ను నమ్ముకున్న వారికి రెండు పోగులు చాలని అన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తల సమిష్టి బలంతో పార్టీని ముందుకు తీసుకెళ్దామన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కాంగ్రెస్ నీ గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలని పిలుపు నిచ్చారు. సోనియమ్మ రుణం తీర్చుకోవడం కోసం సమయం వచ్చిందని, అందుకు రాబోయే మూడునెలలే ఉన్నాయని పొంగులేటి అన్నారు. గ్రూపులు లేకుండా సమిష్టి కృషితో భట్టి,రేణుక, సంబాని,నేను కలిసి అందరి ఆలోచన ప్రకారం ముందుకు వెళ్దామన్నారు. తెలంగాణ వచ్చి తొమ్మిదిన్నర ఏళ్లైంది… మయాల పఖిర్ వేషాలు,మాటలు ఇక నమ్మొద్దని తెలిపారు. తెలంగాణ మేమే తెచ్చామనిని కల్వకుంట్ల చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Jagtial: కోరుట్ల కౌన్సిలర్ భర్తపై కత్తులతో దాడి..! ఆ నాగరాజు ఎవరు?

కల్వకుంట్ల అసలు రూపం, దొంగ దీక్ష అన్నారు. 2014 ముందు మీ ఆస్తి, తర్వాత ఆస్తులు నికు తెలుసు,తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తుపాకీ పట్టుకొని ఎన్ని మోసాలు, దందాలు, భూములు కొల్లగొట్టవో ప్రజలకు తెలుసన్నారు. ఎన్ని వ్యాపారాలు చేసి ఇంత డబ్బు సంపాదించారో తెలంగాణ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టూ మీ ఆస్తులు అక్రమాలు కుప్పలుగా దండు కున్నరని, దీన్ని ప్రజలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి.. రైతులపై ముసలి కన్నీరు కారుస్తూ రుణమాఫి అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సిబ్బందిపై మీరు ఎంతో అరాచకాలు ఇబ్బందులకు గురి చేసి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం అంటున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తీర్పుపై వెన్నులో వణుకు పుట్టుకుందని కీలక వ్యాఖ్యాలు చేశారు. ఇక మీరు ఫ్లాం హౌసేకి పరిమితం చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అసలు వడ్డీ కక్కిస్తామన్నారు. కాంగ్రెస్ అంటే సముద్రం .. ఇందులో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకు రావడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
IIT Student: ప్లీజ్ నా డెడ్ బాడీని ఎవరికీ చూపించకండి.. ఐఐటీ విద్యార్థిని సూసైడ్ నోట్..

Exit mobile version