Site icon NTV Telugu

Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. మరో 1663 పోస్టుల భర్తీకి సర్కారు అనుమతి

Telangana Govt Jobs

Telangana Govt Jobs

నిరుద్యోలకు తెలంగాణ సర్కారు మరో తీపికబురు చెప్పింది. మరో 1663 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. మొత్తం 1663 ఖాళీల్లో 1522 ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులతో కలిపి ఇప్పటివరకు ఆర్థిక శాఖ 46, 998 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.

నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ, 227 ఏఈ, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. భూగర్భ జలశాఖలో 88 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ అండ్ బీలో 38 సివిల్ ఏఈ పోస్టులు, 145 సివిల్ ఏఈఈ, 13 ఎలక్ట్రికల్ ఏఈఈ, 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌, 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఆర్థికశాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.

Exit mobile version