NTV Telugu Site icon

CM Revanth Reddy: మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం రోజు ప్రారంభించే పథకాలు ఇవే!

Cm Revanth

Cm Revanth

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించబోతోంది. మహిళలకు అండగా నిలిచి వారి అభివృద్ధికి బాసటగా నిలిచేందుకు పలు పథకాలను ప్రారంభించనున్నది. ఇప్పటికే మహిళల కోసం మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మార్చి 8న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సందర్భంగా అద్భుతమైన పథకాలను ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయ్యింది. ఇంతకీ ఆ పథకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Also Read:Alia Bhatt: ఆలియా భట్ ఆకస్మిక నిర్ణయం.. ఎందుకు ఇలా చేసింది?

తెలంగాణ ప్రభుత్వం మార్చి 8న ప‌రేడ్ గ్రౌండ్ లో పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్నది. మహిళలపై వరాలు కురిపించనున్నది. మ‌హిళా సంఘాల‌చే ఆర్టీసీ అద్దె బ‌స్సులు ప్రారంభించనున్నది. మొద‌టి విడ‌త‌లో 50 బ‌స్సుల‌కు ప‌చ్చా జెండా ఊపి సీఎం రేవంత్ ప్రారంభించ‌నున్నారు. మ‌హిళా సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాలు చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. 31 జిల్లాల్లో మ‌హిళా సంఘాల‌చే పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం అయిల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నది. 32 జిల్లాల్లో జిల్లాకు 2 మెగా వాట్ల చొప్పున 64 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వ‌ర్చువ‌ల్ గా శంకు స్థాప‌న‌ చేయనున్నారు. ధీరా మ‌హిళా శ‌క్తి 2025 విడుద‌ల‌ చేయనుంది ప్రభుత్వం. 14 వేల అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్పర్ల భర్తీకి సంబంధించి నియామ‌క నోటిఫికేష‌న్ ను జారీ చేయనున్నారు.