Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి వేడుకలను ఇకపై ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారిక జీవో విడుదల చేసింది.
ఏప్రిల్ 26న అధికారిక వేడుకలు..
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి సంవత్సరం ‘వైశాఖ శుక్ల పక్ష దశమి’ రోజున వాసవి మాత జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఈ పర్వదినం ఏప్రిల్ 26వ తేదీన వస్తుండటంతో, ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను కోరింది. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి యువజన సర్వీసులు, పర్యాటక సాంస్కృతిక శాఖను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాల కోసం అయ్యే ఖర్చును సంబంధిత శాఖ బడ్జెట్ నుంచే కేటాయించనున్నారు.
Telangana Government declares Sri Vasavi Matha Jayanthi as an annual State Function.
It will be observed every year on “Vaisakha Shukla Paksha Dashami.”
For 2026, the date falls on 26 April. pic.twitter.com/mJcHvGEiQY
— IPRDepartment (@IPRTelangana) April 23, 2026
ఆర్యవైశ్యుల హర్షం.
వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సమాజ సేవలో, వ్యాపార రంగంలో ముందుండే ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని ఈ నిర్ణయం పెంపొందిస్తుందని వారు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణ రావు పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ నెల 26న తెలంగాణవ్యాప్తంగా ఉన్న వాసవి దేవాలయాలు, ఆర్యవైశ్య సత్రాలలో వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో అత్యంత వైభవంగా జరగనున్నాయి.
తాజావార్తలు
-
Malayalam movie updates: మోహన్‌లాల్‌తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
-
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్‌తోనేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!