Site icon NTV Telugu

Tamilisai: తమిళిసై ఎక్స్ ఖాతా హ్యాక్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

Tamili Sai

Tamili Sai

Tamilisai: ఇటీవల రాజకీయ నేతల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతున్నాయి. డీపీలు మార్చి వాటికి సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు సైబర్ నేరగాళ్లు. గత కొద్దిరోజులుగా రాజకీయ నాయకులు, పోలీసులపపై గురి పెట్టి వారి ఎక్స్, ఫేస్ బుక్, వాట్సప్ లను హ్యాక్ చేస్తున్నారు. అకౌంట్లను హాక్ చేయడమే కాకుండా.. వాటిలో సంబంధంలేని పోస్టులు పెడుతున్నారు. ఇక తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్ హ్యాక్ కు గురైంది. తమిళిసై సౌందరరాజన్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్ అయినట్లు రాజ్ భవన్ అధికారులు గుర్తించారు. దీంతో వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Famous Rama Temples : భారతదేశంలో పురాతనమైన రామాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?

తమిళిసై సౌందర రాజన్ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో కొంతకాలంగా తమకు తెలియకుండా పోస్టింగ్‌లపై రాజ్‌భవన్ వర్గాలు ఆరా తీశాయి. ఎక్స్ ఖాతాను తెరిచే సమయంలో, పాస్‌వర్డ్ తప్పు అని సూచించిందని అన్నారు. మరోవైపు ఈ ఖాతాలో పోస్ట్ చేయని అంశాలను కూడా సిబ్బంది గుర్తించామన్నారు. దీంతో ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించామన్నారు. ఈవిషయమై రాజ్ భవన్ సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. హ్యాకింగ్ కు పాల్పడింది ఎవరు? రాజ్ భవన్ లోని వారేనా లేక ఇతరుల అనే దానిపై ఆరా తీస్తున్నారు. పాస్ వర్డ్ కూడా తప్పు చూపిస్తుందంటే ఇది ఖచ్చింతంగా రాజ్ భవన్ లోని వారే అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గవర్నర్ ఎక్స్ చేసే అవసరం ఎందుకు వచ్చిందని ఆరా తీస్తున్నారు. ఆమె టూర్ విషయాలు ముందే తెలుసుకుని ఏమైనా చేసే ఆస్కారం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇక గతంలో కూడా పలువురు అధికారులు, రాజకీయ నేతల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయ్యాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్‌బుక్ హ్యాక్ అయింది. గతంలో ఆర్టీసీ ఎండీ వి.సి. సజ్జనార్ సోషల్ మీడియా అకౌంట్ కూడా హ్యాక్ చేశారు సైబర్ కేటుగాళ్లు. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఖాతా కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.
Husband Killed His Wife: భార్య పై అనుమానం.. తల నరికేసిన భర్త..!

Exit mobile version