Site icon NTV Telugu

Tamilisai Soundararajan: కాకతీయ స్నాతకోత్సవంలో.. గవర్నర్‌ తమిళిసై

Tamilisai Soundararajan

Tamilisai Soundararajan

రాష్ట్రంలో బీజేపీ-TRS వార్ జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ వరంగల్ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఎన్నో పోరాటాలకు పురుడుపోసిన కాకతీయ యూనివర్సిటీలో గవర్నర్ పర్యటన హై టెన్షన్ సృష్టిస్తోంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై వరంగల్‌లో పర్యటించనున్నారు. అక్కడ కాకతీయ యూనివర్సిటీలో జరిగే 22వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు.. 2019-2020 సంవత్సరంలో వివిధ కోర్స్ లలో పీ.హెచ్.డీ పూర్తి చేసుకున్న 56 మందికి డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేయడంతో పాటు 276 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నారు.

కాకతీయ యూనివర్సిటీ లో గవర్నర్ కార్యక్రమాలు ఉండడంతో ఆసక్తికరంగా మారింది. కే.యూలో బోధన-బోధనేతర సిబ్బందితో కలిపి 11 కమిటీలు వేశారు. ఇవాళ ఉదయం 7.20 నిమిషాలకు రాజ్ భవన్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. ఇక 10 గంటలకు కాకతీయ యూనివర్సిటీకి చేరుకుంటారు. 10.25 నిమిషాల నుండి 12.45 నిమిషాల వరకు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సంలో పాల్గొంటారు. మధ్నాహ్నం 12.55 కు యూనివర్సిటీ గెస్ట్ హౌజ్‌కు చేరుకొని భోజనం చేస్తారు. కాస్త విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గంలోనే హైదరాబాద్ కు వెళ్తారు. అయితే.. రాష్ట్రంలో నెలకొన్న బీజేపీ-TRS వార్ నేపథ్యంలో గవర్నర్ పర్యటన ఉత్కంఠత రేపుతోంది. దీంతో.. గవర్నర్ పర్యటనకు పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో బయటి వ్యక్తులు ఎవరూ లోనికి రాకుండా.. ఆడిటోరియం వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.
Heroine Anjali: అదేంటి అంజలిని ఇలా ట్రోల్ చేస్తున్నారు.. మీకు తెలిస్తే షాక్‌ అవుతారు?

Exit mobile version