Site icon NTV Telugu

Governor Tamilisai: నా ఫోన్ టాపింగ్ అవుతున్నట్టు అనుమానం.. గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు

Governor Tamilasai Phone Taping

Governor Tamilasai Phone Taping

Governor Tamilisai: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోల వ్యవహారంపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేవారు. తనఫోన్‌ కూడా ట్యాప్‌ చేస్తున్నానే అనుమానం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మొదట తుషార్‌ పేరు ప్రస్తావించారని అనంతరం రాజ్‌భవన్‌ పేరు కూడా ప్రస్తావించారని గవర్నర్‌ తెలిపారు. అయితే తుషార్‌ గతంలో రాజ్‌భవన్‌లో తన ఏడీసీగా పనిచేశారన్న తమిళసై అంత మాత్రానికే రాజ్‌భవన్‌ను ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోకి లాగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాది ప్రగతిభవన్ కాదు అంటూ మండిపడ్డారు. చాలా రోజుల నుంచి ప్రభుత్వానికి రాజ్‌భవన్‌కు మధ్యదూరం పెరుగుతూ వస్తున్న క్రమంలో ఇప్పుడు అదికాస్తా ముదిరినట్లు ఆమె మాట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పెండింగ్‌లో ఉన్న బిల్లుల వివాదంపై బుధవారం తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరముందని, వాటిని పరిశీలిస్తున్నానని ఆమె చెప్పారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అన్ని బిల్లులను సమగ్రంగా పరిశీలించేందుకే తాను సమయం తీసుకున్నానని, ఆ బాధ్యత తనపై ఉందని చెప్పారు. ఖాళీల విషయమై సమగ్ర నివేదికను తాను ప్రభుత్వానికి ఇచ్చానని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని తాను ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్‌ చేస్తున్నానని.. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టతనిచ్చారు.

Read also: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో ఇద్దరు అరెస్ట్‌..

కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ్ బిల్లు పై మంత్రి ఎప్పుడైనా రావొచ్చు… వివరణ ఇవ్వొచ్చు. ఒక నెల ఆలస్యం అయిందని రాజ్ భవన్ ముట్టడి చేస్తామని అంటున్న సంఘాలు… ఈ 8 ఏళ్లు ఆలస్యం అయినందుకు ప్రగతి భవన్ ముందు ఎందుకు చేయలేదన్నారు గవర్నర్ తమిళిసై. తాను ఎలాంటి బిల్లులను ఆపలేదని, బిల్లుల్ని తొక్కిపెట్టాననడం సబబు కాదని గవర్నర్ అన్నారు. కొత్త విధానంపై తనకు సందేహాలుండటంతో.. వాటిని పరిశీలిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు కొత్త నియామక బోర్డు అవసరం ఏమొచ్చిందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. వీసీ పోస్టులు సైతం చాలా రోజులుగా ఖాళీగానే ఉన్నాయని, తాను డిమాండ్ చేశాకే వీసీలను నియమించారని తెలిపారు. ఎనిమిదేళ్లుగా వీసీలను నియమించనప్పుడు ఆందోళన చెందని ఐకాస.. ఇప్పుడు తన వద్ద నెల రోజులు ఆగిపోగానే ఎందుకింత ఆదోళన చేస్తోందని నిలదీశారు. తాను మొదటగా నియామకాల బిల్లుకే ప్రాధాన్యం ఇచ్చానని.. ఒకదాని తర్వాత మరొక బిల్లుని పరిశీలిస్తున్నానని.. బిల్లులు పంపిన వెంటనే వాటిని ఆమోదించడం మాత్రమే తన విధి కాదని పేర్కొన్నారు. తాను ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నానని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని గవర్నర్ వెల్లడించారు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో ఇద్దరు అరెస్ట్‌..

Exit mobile version