NTV Telugu Site icon

గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీకి త‌మిళిసై ఆమోదం…

Tamilisai

Tamilisai

గ‌వ‌ర్న‌ర్ కొటాలో ఎమ్మెల్సీకి తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై ఆమోద‌ముద్ర వేశారు.  గ‌వ‌ర్న‌ర్ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించేందుకు నిన్న‌టి రోజున కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది.  దీనికి సంబందించిన ప్ర‌తిపాద‌న‌లను గ‌వ‌ర్న‌ర్‌కు సిఫార‌సు చేశారు.  కేబినెట్ సిఫార‌సుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఈరోజు ఆమోదం తెలిపారు.  త్వ‌ర‌లోనే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశం ఉన్న‌ది.  ఇటీవ‌లే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు.  హుజురాబాద్ నుంచి అవ‌కాశం వ‌స్తుంద‌ని అనుకున్నా, ఆయ‌కు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఇవ్వ‌డం విశేషం.  

Read: “పుష్ప” అప్డేట్ : ఫస్ట్ సింగిల్ డేట్ ప్రకటించిన మేకర్స్