NTV Telugu Site icon

Telangana Govt: ఆరిజన్ లైఫ్ సైన్స్ తో రూ.2000 కోట్ల డీల్ కుదుర్చుకున్న తెలంగాణ సర్కార్

Revanth Reddy

Revanth Reddy

Telangana Govt: దావోస్ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. ఆరిజన్ లైఫ్ సైన్స్ తో 2000 కోట్లకి ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో 1500 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రపంచనికి మెడిసీన్ హబ్ గా ఉన్న హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని అన్నారు. మల్లాపూర్ లో ఉన్న కంపెనీలో పెట్టుబడులు, డ్రగ్స్ డిస్కవరీ డెవలప్మెంట్ మ్యానుఫ్యచరింగ్ రంగాల్లో పెట్టుబడులు, భారీ పెట్టుబడులు కొత్త పాలసీలకు నిదర్శనమన్న సీఎం రేవంత్ తెలిపారు. ఆ సంస్థ సీఈఓతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చ జరిపినట్లు వెల్లడించారు. తెలంగాణలో రూ. 12,400 కోట్లు భారీ పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. బహుళ ప్రయోజనాలతో ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురు చర్చించి నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

Read also: V. Hanumantha Rao: రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు.. వీలైనప్పుడల్లా అయోధ్యను సందర్శిస్తాం

చందనవెల్లిలో రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. రూ. 1400 కోట్ల పెట్టుబడితో, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 6.0 MTPA సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్ వద్ద కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ మరియు క్షిపణి అభివృద్ధి కేంద్రాలు రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నెల ప్రారంభంలో పోర్ట్స్-సెజ్ సీఈవో, గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదానీ ఏరో స్పేస్ సీఈవో ఆశిష్ రాజ్ వంశీ సచివాలయంలో సీఏ రేవంత్ రెడ్డిని కలిశారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు తగిన సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తోందని తెలిపారు. ఇప్పటికే ప్రారంభించిన పాత ప్రాజెక్టులనే కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్‌ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణలో ఏరో స్పేస్ పార్క్‌తో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూప్ సీఎం రేవంత్‌తో చర్చలు జరిపింది.
Sircilla Textile Industry: సిరిసిల్ల పవర్లూమ్స్ కు అందని ఆర్డర్లు.. మూడవ రోజు కొనసాగుతున్న బంద్

Show comments