Site icon NTV Telugu

తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయం.. కమిటీలు ఏర్పాటు..

government lands

government lands

భూముల విక్రయానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. దీని కోసం కమిటీలు ఏర్పాటు చేసింది.. సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ అధ్యక్షతన స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.. భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్‌ కమిటీ, భూములకు అనుమతుల కోసం అప్రూవల్‌ కమిటీ ఏర్పాటు చేసింది. అలాగే, భూముల అమ్మకాలను పర్యవేక్షించేందుకు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు.. నోడల్ శాఖ భూముల ధరను నిర్ణయించి.. ఈ వేలం ప్రక్రియ నిర్వహిస్తుంది. ఈ వేలం ద్వారా పారదర్శకంగా భూముల విక్రయాన్ని చేపట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజా అవసరాలకు అవసరం లేని భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు.. ఈ వేలం ద్వారా వివిధ శాఖల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల అమ్మనున్నారు. అమ్మే భూములకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.. ఈ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం..

Exit mobile version