రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని ధైర్యాన్ని చెప్పారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు… ఇవాళ జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో మాస్కుల పంపిణీ చేశారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని, కోవిడ్ వ్యాప్తి జరుగకుండా ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనగోలు చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసిందని, రాష్ట్రానికి ఏ మాత్రం సహకరించకున్నా.. రైతుల పక్షపాతి, రైతుల సమస్యలు తెలిసిన మన సీఎ కేసిఆర్.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకుని రైతులు పంచించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలతో తడిసిన ధ్యాన్యం కొనుగోలు చేయడంలేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు.
రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు..
Errabelli