హైదరాబాద్: పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాయితి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు (డిసెంబర్ 26) నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. టూ వీలర్స్‌పైన 80 శాతం రాయితీ ప్రకటిస్తున్నట్టు జీవో స్పష్టం చేసింది. త్రీ వీలర్స్‌పై 90 శాతం రాయితీ.. కార్లకు 50 శాతం రాయతీని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దాదాపు రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తింపు.
Also Read: MLC Vamshikrishna: వైఎస్సార్సీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్?
కాగా రాష్ట్రంలోని వాహనదారులకు పోలీసు శాఖ పెండింగ్ చలాన్లు తక్షణమే చెల్లించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వాహనాల పెండింగ్ చలాన్లు రాయితీపై చెల్లింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు అవకాశం కల్పించారు.గత ఏడాది ఇలాగే రాయితీ ప్రకటించడంతో 45 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.300 కోట్ల వరకు చలాన్ల రుసుము వసూలైంది. ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్లతోపాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు చిన్న పట్టణాల్లోనూ చలానాలు విధిస్తున్నారు.
Also Read: Komatireddy Venkat Reddy: కేసీఆర్ ఘనతలు మాకన్నా.. ప్రజలకే ఎక్కువ తెలుసు..!